శనివారం రాత్రి జరిగిన ఘటనతో అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తత తలెత్తేలా కన్పిస్తోంది. శనివారం రాత్రి అస్సాంలోని హైలకండి జిల్లాలో ఒక చోట బాంబు పేలుడు జరిగింది. ఇందులో ప్రైమరీ స్కూల్ నేలమట్టం అయింది. కానీ ఎవరికి గాయాలు కాలేదు. కానీ అనూహ్యంగా అర్ధరాత్రి బాంబు పేలుడు చోటు చేసుకోవడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ విషయంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రిని సంప్రదిస్తామని, వెంటనే దర్యాప్తు జరిపించాలని కోరతానని అన్నారు. అస్సాంలో కూడా ఘటనపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందని, ఇరు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతలు నెలకొనేలా చూడడం ఇద్దరు ముఖ్యమంత్రుల బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. గత నెలలో అసోం-మిజోరాం రాష్ట్రాల పోలీసులు, స్థానికులు మధ్య జరిగిన గొడవలో అస్సాంకు చెందిన ఏడుగురు పోలీసులు మరణించారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 80 మంది గాయాల పాలయ్యారు. ఆ ఉద్రిక్త పరిస్థితులు అమిత్ షా జోక్యంతో చల్లబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: