తెలంగాణలో సర్కారు భూములను అమ్మి ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతోంది.. ప్రభుత్వ భూములు నమ్మాలని సర్కార్ మళ్లీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు గా ప్రచారం జరుగుతోంది. విలువైన భూములు వేలం పాటల ద్వారా అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే హైదరాబాద్ శివారులో కోకాపేట, ఖానా మేట్ భూముల ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సంపాదించింది.. తాజా వివరాల మేరకు ఖానా మేట్ లో 27 పుప్పాలగూడలో 94 ఎకరాలకు వేలం పాట నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కాబోతుండగా 9వ తేదీన ఫ్రీ బిడ్డింగ్ ద్వారా 4 వేల కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుందని అంటున్నారు. ఇక ఈ భూముల వేలం పూర్తయిన తర్వాత హౌసింగ్ అలాగే ఆర్టీసీ సంస్థలకు చెందిన భూములను వేలం వేయడానికి కూడా తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: