ఇప్పుడు దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు టెన్షన్ పెడుతున్నాయి, తాజాగా గుంటూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడారు, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెంగ్యూ అనుమానిత కేసులు గుర్తించామని, 25 వేల మందికి టెస్టులు నిర్వహించామని అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 1575 మందికి డెంగ్యూ సోకిందన్న ఆయన 5 జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని, గుంటూరు, కృష్ణ,  విశాఖ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఏజన్సీ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఆయన, శానిటైజేషన్ పై  ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఇక కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే దీనికి సంబంధించి కేంద్రం నుంచి గానీ డబ్ల్యు. హెచ్. ఒ నుండి ఎటువంటి సంకేతాలు రాలేదని ఆళ్ళ నాని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: