సివిల్ ఇంజనీరింగ్  చేసి కూడా ఉద్యోగాలు దొరక‌ని ప‌రిస్థితి తెలంగాణ‌లో ఉంద‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల అన్నారు. నిరుద్యోగి ఇక్బాల్ ది ఆత్మహత్య   కాద‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన హ‌త్య అని అభివ‌ర్ణించారు. వంద‌ల సంఖ్య‌ల్లో నిరుద్యోగులు మ‌ర‌ణిస్తున్నా ఈయ‌న‌కు చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేద‌ని, ఉద్య‌గాలు క‌ల్పించాల్సింది పోయి రాక్ష‌సానందం పొందుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం చేత‌కాక‌పోతే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇంకెంత‌మంది చంపుత‌వు దొరా? అంటూ ప్ర‌శ్నించారు. పార్టీ స్థాపించిన త‌ర్వాత ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వ లోపాల‌పై పూర్తిగా దృష్టిసారించారు. నిరుద్యోగుల ఆక‌లి కేక‌లు విన‌ప‌డ‌టంలేదా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మొద‌ట‌గా ఎంచుకున్న అంశం కూడా నిరుద్యోగుల‌కు సంబంధించిన‌దే కావ‌డం గమ‌నార్హం. యువ‌త‌, రైతుల శ్రేయ‌స్సు కోస‌మే త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని ఆమె ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో పార్టీ ఏర్పాటు విష‌య‌మై ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల మ‌ధ్య విభేదాలున్నాయ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: