పోలీసుల అదుపు లో మూడు వేల మంది ?

పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న స్థాలిన్ మరో అడుగు ముందు వేశారు. పోలీసు శాఖను ఉరుకులు పట్టించారు. అర్ధరాత్రి వేళ అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన విషయం అందరికీ తెలిసింది. గతంలో  మార్నింగ్ వాక్ చేస్తూ మహిళలతో మాట్లడటం,  ఉదయం సైకిల్ తొక్కుతూ చిన్నారులతో సంభాషించడం వంటి  పనుల ద్వారా ప్రజల మన్నలను చూరగొన్న తాజాగా  స్థాలిన్ పోలీస్ శాఖలో స్పీడ్ పెంచారు. ఆయన పోలీస్ ఠాణా ను సందర్శించిన  వెనువెంటనే పోలీసులు తమ  జూలు విధిల్చి ముందుకు సాగారు.   రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో వివిధ హత్యల కేసులతో సంబంధాలున్న 3,325 మందిని పోలీసు శాఖ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టులన్నీ డీజీపీ సి. శైలేంద్రబాబు నేతృత్వంలోనే జరిగాయి. పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ తనిఖీల్లో భాగంగా 1,110 కత్తులు, ఏడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్ డిసార్మ్’ పేరుతో హత్యల కేసులతో సంబంధాలున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా వర్గపోరు కారణంగా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిని అరెస్టులు చేస్తున్నారు. ఇదే సమయంలో కత్తుల వంటి వస్తువులు  విక్రయించే దుకాణాలపై నిఘా పెట్టాలని, ఈ ఆయుధాలు తప్పుడు వ్యక్తులకు చేరకుండా పర్యవేక్షించాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులా మజాకా !



మరింత సమాచారం తెలుసుకోండి: