తెలంగాణ హైకోర్టులో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుచేయాల‌ని కోరుతూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు  పిటిష‌న్ వేశారు. ఇంత‌కుముందు వీరిద్ద‌రి బెయిల్ ర‌ద్దుచేయాల‌ని కోరుతూ ర‌ఘురామ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. బెయిల్ ఇచ్చే క్ర‌మంలో న్యాయ‌స్థానం విధించే ష‌ర‌తుల‌ను ఉల్లంఘించార‌ని, వారి బెయిల్ ర‌ద్దుచేయాల‌ని రాఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. తాను నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌ని, పిటిష‌న‌ర్ రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు.

మూడునెల‌ల‌పాటు సాగిన విచార‌ణ అనంత‌రం సీబీఐ కోర్టు ర‌ఘురామ‌కృష్ణంరాజు పిటిష‌న్‌ను కొట్టేసింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును స‌వాల్‌చేస్తూ ఎంపీ ర‌ఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డిపై ఆ పార్టీకే చెందిన రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మండిప‌డుతున్నారు. రాష్ట్రాన్ని అధోగ‌తి పాల్జేశార‌ని, అభివృద్ధిని విస్మ‌రించార‌ని, అయిన‌వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌ని, త‌న‌తోపాటు కేసుల్లో ఉన్న‌వారంద‌రికీ ప‌ద‌వులు ఇస్తూ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారంటూ త‌రుచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి నిప్పులు చెరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: