మా ఎన్నిక‌లు అల్ల‌క‌ల్లోల వాతావ‌ర‌ణం న‌డుమ సాగుతున్నాయి. పోలింగ్ బూత్ లో మోహ‌న్ బాబు అరుస్తున్నార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సీరియ‌స్ అయ్యారు. పిచ్చి పిచ్చి అరుపులు అర‌వ‌వ‌ద్ద‌ని ఏద‌యినా ఉంటే నేరుగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని కోరారు. బ‌య‌ట వారు లోప‌లికి వ‌చ్చి అరిస్తే ఎన్నిక‌లు ర‌ద్దు చేస్తామ‌ని కూడా హెచ్చ‌రించారు. దీంతో ఇక్క‌డ ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. తీవ్ర వాగ్వాదాలు ఇరు ప్యానెల్ స‌భ్యులు చేసుకుంటున్నారు. సీనియ‌ర్ న‌టులు చిరు, బాల‌య్య లాంటి వారు హుందాగా నాలుగు మాట‌లు చెప్పి వెళ్లిన‌ప్ప‌టికీ, ఇరు ప్యానెళ్ల మ‌ధ్య త‌రుచూ యుద్ధ వాతావ‌ర‌ణ‌మే ఓటింగ్  స‌మ‌యాన చోటుచేసుకోవ‌డంతో పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్త‌మై, గొడ‌వ‌ల‌కు కార‌ణం అయిన వారిని పోలింగ్ కేంద్రం నుంచి దూరంగా పంపి వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ స‌మ‌స్య‌లు పున‌రావృతం అవుతున్నాయి. దీంతో ఎన్నికలు ర‌ద్దు అవుతాయ‌న్న వార్త‌లు కూడా కొన్ని క్ష‌ణాల కింద‌ట వినిపించిన ప్ప‌టికీ అదేం లేద‌ని న‌రేశ్ మీడియాకు చెప్పి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: