మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ లోని కౌంటింగ్ కేంద్రం వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు కూడా కొందరు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు అభిమానులను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ఉన్న అభిమానులు తమను అడ్డుకున్న పోలీసులతో దిగారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించేందుకు పోలీస్‌ అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. మా ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న ప్రచారం అభిమానులను టెన్షన్‌ పెడుతోంది. సాధారణంగా క్రాస్‌ ఓటింగ్‌ అనే మాట జనరల్‌ ఎలక్షన్స్‌లోనే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈసారి మా ఎన్నికల్లో రాజకీయ అండదండలు అధికం కావడంతో.. మా ఎన్నికల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద క్రాస్‌ ఓటింగ్‌ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుందేమోనన్న చర్చ అభిమానుల్లో జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: