మా అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ ప్ర‌కాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆ ఎన్నిక‌ల‌కు సంబంధించి సీసీటీవీ పుటేజ్ అందించాలంటూ ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు లేఖ రాశారు. ప్ర‌కాష్ రాజ్ కోరిక మేర‌కు తాము సీసీటీవీ పుటేజ్‌లు ప‌రిశీలించామ‌ని, ఎన్నిక‌ల్లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని, విష్ణు గెలుపును మీరు కూడా ఆహ్వానించార‌ని, మీరు ఆరోపిస్తున్న‌ట్లుగా ఎన్నిక‌ల్లోకానీ, సీసీటీవీ పుటేజ్‌లోకానీ ఎటువంటి ట్యాంప‌రింగ్ జ‌ర‌గ‌లేద‌ని, అయినా మీకు ఓ కాపీని అంద‌జేస్తామంటూ కృష్ణ‌మోహ‌న్ బ‌దులిచ్చారు. ఇప్ప‌టికే విష్ణు ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన‌వారంతా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఒక‌వేళ ప్ర‌కాష్ రాజ్ కోర్టుకు వెళ్లినా కేసు నిల‌బ‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని భావిస్తున్నారు. అయితే ప్ర‌కాష్ రాజ్ మాత్రం సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కోర్టుకు వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఆ పుటేజ్‌ను మీడియాకు కూడా అందించాల‌ని భావిస్తున్నారు. ఈరోజు ఉద‌య‌మే ఆయ‌న ఎన్నిక‌లు జ‌రిగిన జూబ్లీహిల్స్ ప‌బ్లిక్‌స్కూల్‌కు వ‌చ్చారు. అక్క‌డి నుంచే పోలీసుల‌తో మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa