క‌రోనా మ‌హమ్మారిని ఎదుర్కోవ‌డానికి అమెరికా త‌న యుద్ధాన్ని తీవ్ర‌త‌రం చేస్తోంది. ప్ర‌జ‌లు టీకాలు వేయించుకోవ‌డానికి ముందుకు రాక‌పోవ‌డంతో ఏంచేయాల‌నే విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ టీకాలు వేయించుకోవాలంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. టీకాలు వేయించుకోనివారివ‌ల్లే అమెరికాలో కేసులు పెరుగుతున్నాయ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఆదేశంలో ఐదు సంవ‌త్స‌రాల నుంచి 11 సంవ‌త్స‌రాల్లోపు వ‌య‌సున్న చిన్నారుల‌కు టీకా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అన్ని అనుమ‌తులు పూర్త‌య్యాయి. ప‌రిశోధ‌న‌ను మ‌రోసారి విశ్లేషించి రెండువార‌ల్లో అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌బోతోంది. ఫైజ‌ర్ కంపెనీ దీన్ని త‌యారుచేసింది. ఇందుకు అవ‌స‌ర‌మైన సిరంజిలను ఆసుప‌త్రులు, ఔష‌ధ దుకాణాలు, చిన్న‌పిల్ల‌ల వైద్య‌నిపుణులు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌తో ఒప్పందం కుదుర్చుకొని స‌ర‌ఫ‌రా చేస్తోంది. అన్ని అనుమ‌తులు రాగానే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చిన్నారుల‌కు టీకాలు వేయ‌డం ప్రారంభిస్తారు. భార‌త్‌లో కూడా త్వ‌ర‌లోనే అనుమ‌తులు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: