తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఈరోజు మ‌ధ్యాహ్నం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌ల‌వ‌నున్నారు. అంతేకాకుండా ప్ర‌ధాన‌మంత్రి, హోం మంత్రి అపాయింట్‌మెంట్ ద‌క్కితే వారిని కూడా క‌ల‌వ‌నున్నారు. మ‌రికొంద‌రు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌ల‌వాల‌ని తెదేపా నేత‌లు నిర్ణ‌యించారు. వీరు ఎవ‌రిని క‌లిసినా ఫ‌లితం ఉండ‌ద‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకంటే చంద్ర‌బాబునాయుడు ఢిల్లీ వెళ్లి రెండున్న‌ర సంవ‌త్స‌రాలైంది. అంతేకాకుండా అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షాతోపాటు ఇత‌ర నేత‌ల‌తో కూడా స‌న్నిహిత సంబంధాలు లేవు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలో చంద్ర‌బాబును ఓడించ‌డానికి కేంద్రం గ‌ట్టిప్ర‌య‌త్నాలే చేసింద‌ని తెదేపా వ‌ర్గాలే వ్యాఖ్యానిస్తుంటాయి. రాష్ట్రంలో జ‌గ‌న్‌కు లోపాయికారీ మ‌ద్ద‌తిస్తున్న మోడీ బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌రు. ఎన్డీయే పెద్ద‌లెవ‌రూ చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు. దీనిక‌తోడు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెర‌వెన‌క రాజ‌కీయం ఎలాగూ చేస్తుంది. కాబ‌ట్టి ఫలితం ఉండ‌ద‌ని తెలిసినా ఒక ప్ర‌య‌త్నం మాత్రం చేయాలి కాబ‌ట్టి.. ఢిల్లీకి వెళుతున్న‌ట్లు తెదేపా వ‌ర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: