ఏపీ ప్ర‌భుత్వం గోదావ‌రిలో పాపికొండ‌ల షికారును తిరిగి ప్రారంభించాల‌ని నిర్న‌యించింది. ఈ మేర‌కు ఏపీ స‌ర్కార్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈనెల 7వ తేది నుంచి తిరిగి పాపి కొండ‌ల షికారు తిరిగి ప్రారంభం కానుంది. రెండు ఏపి టూరిజం బోట్ లు మ‌రియు 14 ప్రైవేట్ బోట్లకు ఏపీ స‌ర్కార్ అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా రాజమండ్రి నుండి పాపికొండల టూర్ కు బోటింగ్ టిక్కెట్ ధర 750 నుండి 1,250 కు పెంచింది. రెండేళ్ల క్రితం క‌చ్చులూరులో బోట్ మునిగి పోవ‌డంతో ప‌లువురు మ‌రణించిన సంగ‌తి తెలిసిందే. 

చ‌నిపోయిన వారిలో ఏపీ తెలంగాణ కు చెందిన ప్ర‌యాణీకులు ఉన్నారు. అయితే లైవ్ జాకెట్ లు ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌యాణీకులు ప్ర‌ణాలు కోల్పోయ‌ర‌ని టూరిజం పై కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌  కచ్చులూరు ఘటన నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో మ‌ళ్లీ పాపింకొండ టూర్ ను ప్ర‌భుత్వం తిరిగి ప్రారంభిస్తోంది. అయితే ఈ సారి త‌గిన జాగ్ర‌త్తలు తీసుకుని టూర్ ను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: