ఇంకో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఏ పార్టీ గెలుస్తుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోల్లో ఒక్కడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో భాగంగా వైసీపీకి పోటీగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకీ టాలీవుడ్ స్టార్స్ నుంచి సపోర్ట్ వస్తుంది.


ఇక ఇప్పటికే చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్ లాంటి హీరోలు పవర్ స్టార్ కి అండగా నిలబడగా తాజాగా మరో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కే తన మద్ధతు అంటూ ఆయనకి విషెస్ తెలుపుతూ X వేదికగా ట్వీట్ చేశారు.బన్నీ ట్వీట్ తో మెగా అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్  ట్వీట్  వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: