ప్రధాని నరేంద్రమోడీ పాలనపైనా, ప్రభుత్వ తీరుతెన్నులపైనా హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్‌ దీపక్‌పరేఖ్‌ (70) తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో మోడీ ప్రభుత్వ కార్యా చరణ క్షేత్ర  స్థాయికి పోలేదని అందువల్ల  అభివృద్ధి  అంతంత గానే ఉందని చెప్పిన పరేఖ్‌ తాజాగా మోడీప్రభుత్వ సంస్కరణలు మెరుగుపడుతున్నాయని, బిజినెస్‌ సానుకూల వాతావరణం పెరుగుతోందని, ఆర్థికవృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.


 


 పరేఖ్‌ మాట్లాడుతూ ఎఫ్‌డిఐల రాకపెరిగిందని, ఇటీవలే ప్రభుత్వం తొమ్మిది రంగాలకు ఎఫ్‌డిఐ పరిమితులు పెంచిందని అన్నారు. భారత్‌పట్ల ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసం పెరిగిందని, శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశంగా భారత్‌ పేరుపడిందన్నారు. బయట దేశాల్లో ప్రధాని మోడీ తన ప్రతిష్టను, దేశప్రతిష్టను మరింత ఇనుమడింపచేశారన్నారు. ఇదేతీరుతో ఉంటే అనతికాలంలోనే భారత్‌ ఎనిమిది శాతానికి వృద్ధిరేటు సాధిస్తుందన్నారు.



 

 ప్రపంచ దేశాలు మొత్తం నగదు సమస్యతో ఉన్నప్పటికీ,  భారత్‌ వృద్ధిరేటు పెరిగితే,  మరింత పెట్టుబడులు వస్తాయన్నారు. భారత్‌లో ప్రైవేటు రంగ మూలధన వ్యయం తక్కువని, అదే ప్రభుత్వం మౌలికరంగవనరులపై భారీ ఎత్తున ఖర్చు పెడుతోందన్నారు.


 


కొత్తప్లాంట్లలో ప్రైవేటురంగం పెట్టుబడులు పెట్టడంలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆపాత్ర పోషిస్తోందన్నారు. ప్రైవేటురంగం అనుకరిస్తోందని వెల్లడించారు. జూన్‌త్రైమాసికంలో ఎక్కువ కంపెనీలు నిరాశ పరిచినప్పటికీ రానున్నకాలంలో మెరుగుపడతాయన్నారు. ప్రత్యేకించి జిఎస్‌టి బిల్లు ఆమోదం, అన్ని అంశాలు సానుకూలం  అయినందున జిఎస్‌టి  2017 ఏప్రిల్‌ నుంచి అమలు కువస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.


 


అత్యున్నతస్థాయిలో అవినీతి కట్టడి అనేది మోడీప్రభుత్వ కీలక విజయంగా పేర్కొ న్నారు. ఈ వేలం, ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో అన్ని పెద్ద కాంట్రాక్టులు అమలవుతున్నందున అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. దివాలా నియమావళి చట్టం, జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ కనెక్టివిటీ, నేరుగా లబ్ధి బదిలీ వంటివి మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలుగా దీపక్‌పరేఖ్‌ మెచ్చుకున్నారు.


జాతీయ ఎన్నికల సమయంలో బి.జె.పి గురించి పరేఖ్ కామెంట్స్ 


మరింత సమాచారం తెలుసుకోండి: