' జియో ' ఇది సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సిమ్ కార్డ్ గురించే డిస్కషన్ లు సాగుతున్నాయి. జియో దెబ్బకి ఇతర సంస్థల  డేటా టారిఫ్ లు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి ఒస్తున్నాయి. రిలయన్స్ సంస్థ ఎప్పుడు అయితే జియో ఆఫర్ ని ప్రకటించిందో అప్పటి నుంచీ ఒకదాని తరవాత ఒకటిగా ఆఫర్ లు ప్రకటిస్తూ ఇతర సంస్థలు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట ఎయిర్టెల్ కష్టపడింది , తరవాత bsnl ఎన్నో ఆఫర్ లు ఇచ్చింది . ఇప్పుడు వోడాఫోన్ తన కస్టమర్ లని పోగొట్టుకోకూడదు కాబట్టి కొత్త ఆఫ్ఫార్ లు అందిస్తోంది. వారు ఇచ్చిన ప్రస్తుత టారిఫ్ ప్రకారం ఒక జీబీ 4జీ డేటా ధరకు 10 జీబీ డేటా అందించనున్నారు. ఈ ఆఫర్ మూడు నెలల పాటు ఉంటుందని తెలిపింది. సూపర్ నెట్ అనే వినియోగదారుడు గా పిలుస్తారు వీరిని. ఈ వినియోగదారుడు 1 జీబీ కి డబ్బు కడితే అదనంగా 9 జీబీ డేటా ఒస్తుంది. కొత్తగా ఒస్తున్న 4జీ హ్యాండ్ సెట్ లతో ఇప్పుడు ఒక జీబీ ధారణ మూడు నేలలతో పాటు 10 జీబీ డేటా ని కూడా పొందచ్చు అని చెప్పింది వోడాఫోన్. వొడాఫోన్ సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్ ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. డిసెంబర్ 16 వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. తమ వినియోగదారులు 4జీ హ్యాండ్ సెట్లకు అప్ గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ను తెచ్చినట్టు ఈ ప్రకటనలో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: