ముంబైలోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో భారీ కుంభ‌కోణం వెలుగు చూసింది. దాదాపు రూ.11360 కోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు పీఎన్ బీ గుర్తించింది. కొంద‌రు ఖాతాదారుల కోసం కొన్ని మోస‌పూరిత‌, అన‌ధికార లావాదేవీలు జ‌రిగిన‌ట్లు గుర్తించిన పీఎన్ బీ.. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఫిర్యాదు చేసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని సదరు ఖాతాదారుల అకౌంట్లలోకి ఇతర బ్యాంకులు కూడా భారీగా సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పీఎన్‌బీ ఓ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

ఈ కుంభకోణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఈ స్కాంపై విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పీఎన్‌బీ స్పష్టంచేసింది. తమ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై ఈ స్కాం ఎలాంటి ప్రభావం చూపుతుందో పీఎన్‌బీ చెప్పలేదు. ఇక ఆ ఖాతాదారులకు డబ్బు జమ చేసిన ఇతర బ్యాంకుల వివరాలు కూడా వెల్లడించలేదు.  తమ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై ఈ స్కాం ఎలాంటి ప్రభావం చూపుతుందో పీఎన్‌బీ చెప్పలేదు. ఇక ఆ ఖాతాదారులకు డబ్బు జమ చేసిన ఇతర బ్యాంకుల వివరాలు కూడా వెల్లడించలేదు.

ఈ లావాదేవీలను మళ్లీ రివర్స్ చేస్తారా, విచారణ సంస్థలు వీటిని తిరిగి రాబడతాయా అన్నదానిపై ఇప్పుడే స్పష్టంగా ఏమీ చెప్పలేమని ముంబైకి చెందిన బ్యాంకింగ్ అనలిస్ట్ అశుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: