ఆపిల్ అంటే తెలియని వారుండరు.తినే ఆపిల్ కాదండోయ్ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ..ఈ బ్రాండ్ వస్తువులకు మార్కెట్లో వున్న వాల్యూ గురించి అందరికి తెలిసిందే.ఇదివరకే ఎన్నో మోడల్ ఫోన్స్ తో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్ద తాజాగా ఐఫోన్ ప్రియులకు తీపికబరు వినిపించింది.సెప్టెంబరు10న కొత్త మోడల్ ఐఫోన్లను ఆవిష్కరించ నున్నట్లు ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం సెప్టెంబరు 10న రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియా కుపర్‌టినో లోని సంస్థ కార్యాలయంలో ఉన్న 'స్టీవ్ జాబ్స్' థియేటర్‌ లో సరికొత్త ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.అందుకోసం మీడియా సంస్థలకు ఆహ్వానాలు కూడా పంపింది.ఇక ఆపిల్ సంస్దకు ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ ఫోన్లను ఆవిష్కరించడం అలవాటు,అందుకే ఈ సంవత్సరం కూడా ఐఫోన్ 11 సిరీస్‌లో..iPhone 11,iPhone 11 Pro, iPhone 11 Pro Max పేరిట మూడు సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.అధునాతన ఫీచర్లతో ఈ కొత్త ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకురానున్నారు.వీటితో పాటు సరికొత్త ఆపిల్ వాచ్‌లను, ఐప్యాడ్ ప్రొ మోడల్స్‌ను కూడా సంస్థ విడుదల చేయనుందట..




iPhone 11లో 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.3డి టచ్ సపోర్ట్ లేకుండానే పనిచేస్తుంది.ఇందులో ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు.3110 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు.ఈ ఫోన్ ధర 749 అమెరికన్ డాలర్లుగా (రూ.53,700) ఉండే అవకాశం ఉంది.

iPhone 11 Pro ఫోన్‌లో 5.8 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్‌ను, ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,వెనుక భాగంలో మూడు 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు.512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు. 3110 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ ధర 999 అమెరికన్ డాలర్లుగా (రూ.71,000) ఉండే అవకాశం ఉంది.


iPhone 11 Pro Max ఫోన్‌లో 6.5 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్‌ను, ఎ13 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుక భాగంలో మూడు 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. 512 జీబీ స్టోరేజీ వరకు అందిస్తున్నారు. 3500 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. ఈ ఫోన్ ధర 1099 అమెరికన్ డాలర్లుగా (రూ.78,800) ఉండే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: