ఇక మన దేశంలో వెండి, బంగారం అంటే చాలా మందికి చాల ఇష్టం. ఇక ఈరోజు  వెండి, బంగారం ధర విషయానికి వస్తే వెండి మాత్రం బాగా భారీగా దగ్గింది. దాదాపు  రూ.2,300 పైగా దగ్గిపోయింది వెండి ధర.బంగారం  ధర మాత్రం కొండెక్కింది. ఇక మన హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.910 పెరుగుదలతో రూ.39,580కు వరుకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ ఉండడం వల్ల బంగారం ధరపై సానుకూల ప్రభావం ఇప్పటిలో లేదు అని  మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.

అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.910 పెరుగుదలతో రూ.36,360కు చేరింది. బంగారం ధర భారీగా పెరిగితే.. వెండి ధర మాత్రం చాల తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు కిందికి వచ్చింది. పరిశ్రమ యూనిట్లు మరియు నాణేపు తయారీదారుల నుంచి మంచి డిమాండ్‌‌ లేకపోవడం కారణంగా నిపుణులు తెలిపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మహా నగరాలలో ఒకటి ఐనా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు మాత్రం ఇలానే ఉన్నాయి.

ఇక ఢిల్లీ మార్కెట్‌లోనూ కూడా  బంగారం ధర  భారీగా పెరిగింది. పది గ్రాములకు రూ.950 మేర పరుగులు పెట్టింది అని ఢిల్లీ మార్కెట్‌ నిపుణులు తెలిపారు.  10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,150కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.38,950కు వెళ్ళింది. పసిడి ధర పరిగెడితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు వద్ద పతనమైంది.

ఇక గ్లోబల్ మార్కెట్‌ విషయానికి వస్తే   గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1,513.65 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 17.66 డాలర్లకు తగ్గింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: