అనంతపురంలోని తిలక్‌రోడ్డులో ఈ నెల మూడవ వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐ సాగర్‌ ఆధ్వర్యంలో పలు షాపుపై దాడులు జరిగాయి. నందకిశోర్‌ అనే వ్యక్తి కిరాణాషాపులో టపాసులు విక్రయిస్తున్నట్లు గ్రహించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రూ. 62వేలు విలువ జేసే బాణా సంచాను  సీజ్‌ చేశారు. సదరు దుకాణం రద్దీ ప్రాంతంలోనే కాకుండా ఇళ్ల మద్య ఉంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన చుట్టూ నాలుగైదు ఇళ్లకు ప్రభావం ఉంటుంది అని తెలిపారు అధికారులు. 


గతేడాది దీపావళి పండగకు జిల్లా కేంద్రంలో దాదాపు 123 షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి 185 దరఖాస్తులు వచ్చినా కొంతమంది వద్దు అనుకోవడంతో 123 మంది ముందుకువచ్చారు. వీరు షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపకశాఖ అధికారులకు ఒక్కొక్కరు రూ. 5వేలు ఇవలిసి వచ్చింది. ఈ లెక్కన గతేడాది అగ్నిమాపకశాఖ అధికారులకు మూడు రోజుల షాపులకు రూ.6.15 లక్షల అక్రమ ఆదాయంని పొందారు అధికారులు. గతేడాది మాత్రమే కాదు కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఈ సంవత్సరం కూడా రూ. 5వేలు ‘రేటు’ పెంచాలనే ప్రయత్నంలో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తుంది.


టపాసులదందాలో  ప్రతి ప్రభుత్వశాఖకూ ఉన్నట్లుగానే అగ్నిమాపకశాఖ అధికారులకూ ఓ రేటు ఉంది. వారి ముడుపులు వారికి ముట్టిన తర్వాతనే టపాసుల వ్యాపారానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారు. అయితే రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు ముందు వరుసలో ఉండగా అగ్నిమాపకశాఖ అధికారులు మాత్రం చివరిలో ఉంటారు. అంతే తప్ప మిగతా దందా అంత సేమ్‌ టూ సేమ్‌. జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్న రూ.వందల కోట్ల చీకటి వ్యాపారం పేదల్లో ఏమో కానీ అధికారుల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపుతోంది.

అక్రమ వ్యాపారాన్ని సక్రమం చేసే పనిలో భాగంగా భాగస్వామ్య ప్రభుత్వశాఖలకు ముడుపులు భారీగా ముడుతున్నాయి. ఇందులో సింహభాగం కమర్షియల్‌ ట్యాక్స్, రెవెన్యూ శాఖలకు వెళ్తుండగా చివరిలో అగ్నిమాపకశాఖ అధికారులు తమ వాటా లెక్కలేసుకొని మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: