ఈ సంవత్సరం మేలోనే వన్ ప్లస్ 7తరువాత  సెప్టెంబర్ లో  లాంచ్ చేసిన వన్ ప్లస్ 7టీ రూ.37,999 ధరతో మార్కెట్ లో ఉంది.   వన్ ప్లస్ 7 ప్రోని తలపించే విధంగా ఉన్నా   వన్ ప్లస్ 7టీ రివ్యూ మీ కోసం....  డిజైన్ పరంగా వన్ ప్లస్ 7లో ఉన్న కొన్ని ఫీచర్లను అలాగే ఉంచేశారు. వన్ ప్లస్ 7లో మాదిరిగానే వాటర్ డ్రాప్ నాచ్, ఫ్లాట్ స్క్రీన్ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. 


వన్ ప్లస్ ‘టీ ’ కెమెరావిషయానికి వచ్చేసరికి సరిగ్గా ఫోన్ కు మధ్యలోవెనకవైపు ట్రిపుల్ కెమెరా  వృత్తాకార సెటప్ ను ఎంచుకుంది. ఇందులో మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు  దాని కిందనే వన్ ప్లస్ లోగో కూడా ఉంది. ఇందులో ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ ఫీచర్ మరియు 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా లేదు. వెనకవైపు, ముందువైపు ఉన్న గ్లాస్ కోటింగ్.. ఈ ఫోన్ కి ప్రీమియం లుక్ ను తీసుకువచ్చింది. డిజైన్ విషయంలో వన్ ప్లస్ 7టీ మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. వన్ ప్లస్ 7టీలో 6.55 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లే,స్క్రీన్ రిజల్యూషన్ 2400x1080 పిక్సెల్స్,యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.


ప్రాసెసర్ విషయంలో వన్ ప్లస్ ఎప్పుడూ రాజీ పడదు. మార్కెట్లోకి ఉన్న అత్యంత అధునాతన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ నే ఉపయోగిస్తుంది. వన్ ప్లస్ 7టీలో కూడా ఆ విధానాన్నే అనుసరించింది. మార్కెట్లో ఉన్న అత్యంత అధునాతనమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించింది. గ్రాఫిక్స్ విషయంలో చూస్తే.. 855 కంటే 855+ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. అంతే కాకుండా 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. యూఎఫ్ఎస్ 3.0 టెక్నాలజీ కలిగిన 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంది.బ్యాటరీ విషయంలో కూడా వన్ ప్లస్ 7 కంటే వన్ ప్లస్ 7టీలో చిన్న మార్పు చేశారు. వన్ ప్లస్ 7లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, వన్ ప్లస్ 7టీలో 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. అంతే కాకుండా Warp Charge 30T అనే కొత్త టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఈ టెక్నాలజీ ద్వారా మీ ఫోన్ 30 నిమిషాల్లోనే 70 శాతం చార్జింగ్ ఎక్కుతుందని వన్ ప్లస్ ప్రకటించింది.

అయితే మేం చేసిన పరీక్షలో 30 నిమిషాల్లో 65 శాతం చార్జింగ్ ఎక్కింది. ఫీచర్ల విషయంలో చూసినా, ధర విషయంలో చూసినా వన్ ప్లస్ 7టీ.. వన్ ప్లస్ 7కి, వన్ ప్లస్ 7 ప్రోకి మధ్యలో ఉంటుంది. ఇందులో మీకు 90 హెర్ట్జ్ డిస్ ప్లే, వెనకవైపు మూడు కెమెరాల సెటప్ వంటి వన్ ప్లస్ 7 ప్రో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ సైజ్ చిన్నదే అయినప్పటికీ, అది ఉందనే విషయం మాత్రం మనకి తెలుస్తూనే ఉంటుంది. నాచ్ లేకుండా వన్ ప్లస్ 7టీ ప్రోని తీసుకురావడం కోసమే.. వన్ ప్లస్ ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ను ఉంచి ఉండవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: