రెంటుకు ఎక్కడైనా ఇల్లు దొరుకుతుంది, బైకులు కార్లు కూడా దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి.. సినిమా వాళ్లకు అయితే అద్దెకు అన్ని తెచ్చుకోవాలి.. ఇప్పుడు కొత్త ఆఫర్లు వచ్చాయండి బాబు.. ఆపిల్ ఫోన్ కొనాలంటే మస్తు పైసలు ఉండాలని చాలా మంది అనుకుంటారు. మధ్యతరగతి వాళ్ళ విషయానికొస్తే .. అందని ద్రాక్ష పుల్లన అన్న సామెతకు తగ్గట్లు ఉంటారు. వారు కూడా ఒక్కసారైనా ఆ ఫోన్ చూడాలని వాడాలని అనుకుంటారు.. 


మీ కళలకు కళ్లెం వెయ్యకండి ఇదిగో మీ కల నెరవేరే మార్గం వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు.. త్వరపడండి.. అదేదో చిట్టి పాట కాదు ఐ ఫోన్ అద్దెకు ఇవ్వబడుతుంది. మొన్న ఆమధ్య ఇస్తామని అన్న యాపిల్ యాజమాన్యం ఈరోజు ఏకంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. అన్ని దొరికినట్లే అద్దెకు ఈ ఐ ఫోన్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. బాగా డబ్బున్న వారు మాత్రమే కొనగలిగే ఈ ఐఫోన్లను అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆపిల్ సంస్థ సరికొత్త ప్రణాళికను రూపొందించింది.


మాములుగా మనం ప్రతి నెలా ఇంటి రెంట్ కట్టే విధంగా దీనికి కూడా అద్దె కట్టి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం అది వాడుకునే సమయంలో సరికొత్త మోడల్ ఏదైనా రిలీజ్ అయితే.. ఈ ఫోన్‌ను తిరిగి ఇచ్చేసి కొత్త ఐఫోన్‌ను రెంట్ కట్టి తీసుకోవచ్చు. ఇదంతా నిజంగా నిజమవుతుందా అంటే.. అవునని అంటున్నారు ఆపిల్ సంస్థ అధికారులు. త్వరలోనే ఈ ఫోన్లు అద్దెకు ఇచ్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆయా సంస్థ వెల్లడించింది . 


వివరాల్లోకి వెళితే.. ఇలా అద్దెకు తీసుకున్నవారు ఐక్లౌడ్, ఐట్యూన్స్ వంటి సర్వీసులను అదనంగా డబ్బులు చెల్లించి తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా ఉన్నారని.. అయితే ,త్వరలోనే ఈ కార్యక్రమం చేపడతామని సంస్థ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరి రెంటుకు ఐ ఫోన్స్ అంటే అందరు ఎగబడతారన్నమాట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: