ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే అసలు చెప్పకూడదు లెండి.. ఒకోరోజు ఒకోలా ఉంటాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. ఇంకా గత నెల నుండి అయితే ఆగకుండా పెరుగుతూనే వున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు. కేవలం నాలుగు వారాల్లో నాలుగు రూపాయిలు పెరిగింది పెట్రోల్ ధర, డీజిల్ ధర. అంటే నెల ముందు 76 రూపాయిలు ఉండే పెట్రోల్ ధర.. నెల తర్వాత 80 రూపాయలకు చేరింది. 

 

అయితే పెట్రోల్ ధర ఇంత పెరుగుతుంటే ప్రముఖ మార్కెట్ నిపుణులు మాత్రం సంతోష పడండి ఇంతే పెరిగాయి అని అంటున్నారు. దీంతో అందరూ ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అనుకుంటున్నారా ? ఇంకెందుకు అండి నాలుగు వారాలలో 4 రూపాయిలు పెరిగితే ఆ మాత్రం ఆశ్చర్యపోమా ? దీనికి మార్కెట్ నిపుణులు సమాధానం ఇస్తూ..  

 

పెట్రోల్, డీజిల్ ధరలను గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10 రూపాయిలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గత సంవత్సరం లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయిలు ఉన్నట్టు ఇప్పుడు కేవలం 79 రూపాయిలే ఉంది అని ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు గత సంవత్సరంలోనే ఉన్నాయి అని అయితే ఇప్పుడు మరి అవే ధరలు పెరిగేసరికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అయితే ఈరోజు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పెట్రోల్ ధర రూ.79.86 వద్దకు చేరగా, డీజిల్ ధర రూ.72.15కు చేరుకుంది. అమరావతిలో 20 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 79.54 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 14 పైసలు పెరుగుదలతో 71.34 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం రివ్యూ చూశాక బాగానే తగ్గాయి అని అనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: