ఫోన్ పే.. ఒకప్పుడు 100 రూపాయిలు ట్రాన్స్ఫర్ చేస్తే 10 రూపాయిలు స్క్రాచ్ కార్డులో వచ్చేది.. కానీ ఇప్పుడు 10 వేలు ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క రూపాయి కూడా రాదు.. ఏ అంటే డొమినోస్ లో ఆఫర్ మిత్రలో ఆఫర్ అని చెప్తుంది. అయితే ఆ ఆఫర్స్ గురించి పక్కన పెడితే ఫోన్ పే వినియోగదారులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 

 

గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఫోన్ పే తన కస్టమర్ల కోసం ఏటీఎం సర్వీసులను తీసుకొచ్చింది. ఇన్నాళ్లు యుపిఐ మీదా నడిచిన ఈ ఫోన్ పే ప్రస్తుతం ఏటీఏం సర్వీసుని లాంచ్ చేసి తొలి డిజిటల్ ఏటీఎం సంస్ధగా నిలిచింది. ఏటివంటి ఇబ్బంది లేకుండా ఈ ఫోన్‌పే ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసుకునేలా సృష్టించారు. 

 

అయితే ఈ ఫోన్ పే ఏటీఎం సర్వీస్ ను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి మర్చంట్ పార్టనర్ నుండి డబ్బు తీసుకువచ్చి. దీంతో కిరాణా స్టోర్ లో ఫోన్ పే యూజర్లకు ఏటీఎం సెంటర్ గ పని చేయనుంది. ఈ ఏటీఎం రావడం వల్ల వ్యాపారులకూ బెనిఫిట్.. 

 

ఎలా అనుకుంటున్నారా? వ్యాపారులు వారి వద్ద డబ్బును బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేయకుండా ఈ ఫోన్ పే ఏటీఎంతో ఇలా కస్టమర్లకు ఇవ్వడం వల్ల నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు క్రెడిట్ అవుతాయని వివరించారు. అయితే ఏటీఎం వస్తుంది అని గతంలోనే పేటీఎం చెప్పింది.. కానీ అది ఫోన్‌పే తీసుకొచ్చి పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే వంటి సంస్థలకు షాక్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: