కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త పన్నుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏడు శ్లాబుల విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం ఆదాయపు పన్నును చెల్లించే వారిలో పాత, కొత్త వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని చెప్పటంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. 
 
పాత ట్యాక్స్ సిస్టం మంచిదా...? కొత్త ట్యాక్స్ సిస్టం మంచిదా...? అనే ప్రశ్నకు పాత ట్యాక్స్ సిస్టం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ట్యాక్స్ సిస్టం ద్వారా పన్ను రేటు తగ్గించినట్టు కేంద్రం చెబుతున్నప్పటికీ డిడక్షన్స్, మినహాయింపులను తొలగించటంతో కొత్త పద్ధతిని ఎంచుకున్న వారికి ప్రయోజనం కలగకపోగా జేబులు ఖాళీ కానున్నాయి. ట్యాక్స్ నిపుణులు కొత్త శ్లాబుల విధానం ఎంచుకుంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ ఉండటం గమనార్హం. 
 
డిడక్షన్స్ ఉండటం వలన పన్ను చెల్లించే మొత్తం మిగలటంతో పాటు 80c మరియు 80ccd(1b) కింద 3 లక్షల వరకు మినహాయింపును పొందవచ్చు. పాత పన్ను విధానంలో గృహ రుణాల, ఇంటి అద్దె భత్యాల విషయంలో మినహాయింపును పొందవచ్చు. కొత్త ట్యాక్స్ విధానంలో డిడక్షన్ చూపించలేకపోవడం వలన పన్ను ఎక్కువమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా పాత ట్యాక్స్ విధానమే కొత్త ట్యాక్స్ విధానం కంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: