బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా? ఎందుకు తగ్గిందో తెలుసా? అసలు బంగారం తగ్గటానికి కారణం ఏంటి తెలుసా? ఆ బంగారం ఎఫెక్ట్ ఏంటో తెలుసా? తెలియదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.. బంగారం.. భారీగా తగ్గటానికి కారణం కరోనా ఎఫెక్ట్. కరోనా కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్ డీలా పడిపోయింది.. దీంతో ఒక్క బంగారం ధరలు ఏంటో అన్ని ధరలు భారీగా తగ్గిపోయాయి. 

 

అందుకే బంగారం కొనుగోలు దారులు అటు వైపు దేశాలు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోయింది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే నేడు బుధవారం బంగారం ధరలు ఎంత తగ్గాయి అంటే.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై దాదాపు 290 రూపాయిల తగ్గుదలతో 42,240 రూపాయలకు చేరింది. 

 

అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా దాదాపు 290 రూపాయిల తగ్గుదలతో 38,690 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర అయితే మరి దారుణంగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా 300 రూపాయిల తగ్గుదలతో 49,000 రూపాయలకు చేరింది. దీనికి కారణం.. అంతర్జాతీయంగా బంగారంపై డిమాండ్ భారీగా తగ్గటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. భవిష్యేత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు రేపు ఎలా ఉండనున్నాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: