ప్రజల కోసం.. కేంద్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అందిస్తున్నాయి.. ప్రతి ఒక్కరు లాభాలతో ఆనందంగా ఉండాలని ప్రజలు ఆనందపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల అద్భుత పథకాలను ప్రవేశ పెట్టింది. వృద్దులకు, ఆడపిల్లలకు, ఆర్ధికంగా వెనుకబడిన వారిని లక్ష్యంగా ఎన్నో అదిరిపోయే స్కీమ్స్ ని అందిస్తుంది. 

 

ఆలా కేంద్ర ప్రెవేశపెట్టిన పథకాలలో భాగస్వాములు అవ్వడం వల్ల సామాజిక ఆర్థిక భద్రత పొందొచ్చు. అయితే కేంద్రం ఒక్క కొత్త పథకాలు మాత్రమే కాదు ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసి.. అదిరిపోయే స్కీమ్స్ తీసుకొచ్చింది. అయితే ఆ స్కీమ్ లో కేవలం 100 రూపాయిలు కడితే 75 వేలు వస్తాయి. 

 

అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన అనే రెండు స్కీమ్‌ను కలిపి కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఆ పథకం పేరు ఆమ్ ఆద్మీ బీమా యోజన అనే స్కీమ్‌. అయితే ఆ స్కీమ్‌ను దిగ్గజ బీమా కంపెనీ అయినా ఎల్‌ఐసీ అందిస్తోంది. 

 

ఆ స్కీమ్ కి సంవత్సరానికి కేవలం 200 కట్టాలి.. కానీ కేంద్రం అందులో 50 శాతం కడుతుంది. కాబట్టి మీరు కేవలం 100రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ 100 రూపాయిలు 30,000ల కవరేజ్‌కు వర్తిస్తుంది. ఇంకా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలి అంటే వయసు 18 నుంచి 59 ఏళ్లలోపు ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికే ఈ స్కీం వర్తిస్తుంది. 

 

అయితే ఈ స్కీమ్‌లో చేరాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఓటర్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ప్రభుత్వం జారీ చేసే ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇంకా ఈ స్కీమ్స్ ఎలా వర్తిస్తాయి అంటే.. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో చేరిన వ్యక్తి సహజ మరణం పొందితే 30వేల రూపాయిలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. 

 

ఆ డబ్బును కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఇక సహజ మరణం కాకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లేదా మరి ఎలా అయినా వ్యక్తి మరణిస్తే అప్పుడు కుటుంబ సభ్యులకు 75 వేల రూపాయిలు చెల్లిస్తారు. ఇక అంతేకాదు.. ఈ స్కీంలో చేరటం వల్ల ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే కాదు.. పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు అర్హులు అయితే వెంటనే ఈ స్కీంలో చేరిపోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: