బంగారం ధరలు చూస్తే.. ఎవరైనా సరే.. వావ్ అని అనాల్సిందే.. అలా ఉన్నాయి ఆ బంగారం ధరలు. ఒక రోజు తగ్గి మరో రోజు పెరిగే బంగారం ధరలు ఇటీవలే కాలంలో మరి దారుణంగా పెరిగిపోయాయి. ఆ బంగారం ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అలా ఉంటున్నాయి బంగారం ధరలు.. ఒక్క రోజులో 1500 రూపాయిలు పెరిగింది.. అలాంటి బంగారం ఇప్పుడు కేవలం 10 రూపాయిలు పెరిగి వావ్ అనిపిస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 45,900 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయిల పెరుగుదలతో 42,080 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర భారీగా తగ్గింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 1,130 రూపాయిల తగ్గుదలతో 51,000 రూపాయిల వద్దకు క్షిణించింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. అయితే.. బంగారం ధరలు నిన్న మొన్న పెరిగినట్టు వేలు వేలు కాకుండా కేవలం 10 రూపాయిలే పెరగటం కొంచం ఆనందాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: