ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుత దేశ మార్కెట్ ను కూడా దెబ్బ తీస్తుంది.. ఇప్పటికే చైనా మార్కెట్ ను నేల నాకించిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంపై పడి ఏడుస్తుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే..  నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు భారత్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 

 

ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ 2450 పాయింట్స్ డౌన్ అయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా ఏకంగా 15 శాతం పడిపోయాయి.. ఉదయం 9:44 నిమిషాలకు సెన్సెక్స్ 1,325.77 పడిపోయి 36,223.85 పాయింట్ల వద్ద, నిఫ్టీ 388.00 పాయింట్లు తగ్గి 10,601. 40 వద్ద ప్రారంభమయ్యింది. 

 

ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోను కోలుకోకపోగా గంట గంటకూ భారీగా పడిపోయాయి. ఒకానొక దశలో ఏకంగా సెన్సెక్స్ 2,450 పాయింట్లు నష్టపోయి 15 నెలల కనిష్టానికి చేరింది. అయితే మొదటి సారి అంత నష్టానికి గురించి. 2వేలకు పైగా పాయింట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి అవడం గమనార్హం. ఎస్బీఐ, ఎల్ఐసీ ఆదుకుంటుందనే సంకేతాల నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు లాభాల్లోకి వచ్చాయి.  క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. కరోనా ప్రభావం కారణంగానే మార్కెట్ లో నష్టాలు ఇలా భారీగా జరిగాయి. 
    

మరింత సమాచారం తెలుసుకోండి: