దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న తరుణంలో కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. కేంద్రం అన్ని మెట్రో నగరాల్లోను గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ పై 65 రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయని తెలుస్తోంది. 
 
కేంద్రం 65 రూపాయలు తగ్గించడంతో ఢిల్లీ, కోల్ కతాలో సిలిండర్ ధర 744 రూపాయలుగా ఉంది. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర 761 రూపాయలకు, ముంబైలో 714 రూపాయలకు దిగొచ్చింది. కేంద్రం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 14 కేజీల సిలిండర్ మత్రమే కాక గృహేతర అవసరాల కోసం వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 96 రూపాయలు తగ్గింది. 
 
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం 14 కేజీల సిలిండర్లను సంవత్సరానికి సబ్సిడీ కింద 12 సిలిండర్లను అందిస్తోంది. 12 సిలిండర్ల వరకు ప్రతి సిలిండర్ కు సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ లో జమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లోని క్రూడ్ ధరలు, రూపాయి మారక విలువ, ఇతరత్రా విషయాల ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన జరిగే సవరణలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: