పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా అసలు తగ్గకుండా.. పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో రోజుకు 10 పైసలు, 12 పైసలు పెరుగుతూ లేదా తగ్గుతూ ఉండేది. కానీ ఇప్పుడు గత మూడు వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు అసలు కదలడం లేదు.. అక్కడే స్థిరంగా కొనసాగుతుంది. 

 

నెల రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజుకు పది పైసలు 20 పైసలు తగ్గుదలతో ఏకంగా 3 రూపాయిలు తగ్గింది. ఇంకా ఆతర్వాత కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా నాలుగు రూపాయిలు తగ్గింది. ఆలా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటి నుండి మళ్లీ పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

నేడు గురువారం హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: