ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పన్ను చెల్లించే ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. కేంద్రం పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ రిఫండ్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కరోనా వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ట్యాక్స్ పేయర్స్ కు ఉపశమనం కలగనుంది. 
 
కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం 5 లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్న ఆదాయపు పన్ను రిటర్నులకు వర్తించనుందని సమాచారం. తాజాగా తీసుకున్న నిర్ణయం జీఎస్టీ, కస్టమ్ రిఫండ్స్‌కు కూడా వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. కరోనా వల్ల దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని... అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నమని ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. 
 
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలగనుంది. కేంద్రం సూక్ష్మ , మధ్య తరహా పరిశ్రమలతో పాటు లక్ష బిజినెస్ కంపెనీలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతా ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనపై పన్నుచెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: