కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నింటిపైనా పడిన సంగతి తెలిసిందే.. ఈ ఎఫ్ఫెక్ట్ పోవాలి అంటే ఎంత కాదు అన్న ఇంకో రెండు లేదా మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. ఇంకా అందుకే అన్ని కూడా వడ్డీ రేటును భారీగా తగ్గిస్తున్నాయి.. మొదట (ఆర్బీఐ) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో బ్యాంకులు కూడా ఇప్పుడు వరుసపెట్టి వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ వస్తున్నాయి. 

 

ఇంకా (ఎస్బిఐ) కూడా దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్ని కూడా వడ్డీ రేట్లను భారీగా తగ్గించేశాయ్. దింతో ఇప్పుడు ఈ బ్యాంకుల్లో డబ్బులు ఎఫ్‌డీ చేస్తే తక్కువ వడ్డీ వస్తుంది.

 

స్టేట్ బ్యాంక్ వంటివి అన్ని కూడా ఇప్పుడు వచ్చే వడ్డీ రేట్లపై 0.40 శాతం తగ్గించేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో స్కీమ్స్ పై వడ్డీ రేట్లలో కోత విధించింది. ఇప్పుడు ఎస్బిఐ వంటి దిగ్గజ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కంటే కుడా చిన్న చిన్న బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యడం మేలు. ఎక్కువ రాబడి పొందాలి అంటే చిన్న చిన్న బ్యాంకులే ఎంతో నయం. అయితే ఏ బ్యాంకులో ఎంత శాతం వడ్డీ ఇస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ .. ఎఫ్‌డీలపై 5 శాతం నుండి 9 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 

 

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 9 శాతం మధ్యలో వడ్డీని అందిస్తుంది. 

 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఇస్తుంది. 5.5 శాతం నుంచి 8 శాతం మధ్యలో వడ్డీ ఇస్తుంది. 

 

ఉత్కర్ష్క్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 4.75 శాతం నుంచి గరిష్టంగా 8.2 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. 

 

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.4 శాతం వడ్డీ మాత్రమే ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: