కరోనా వైరస్.. ఎంత దారుణమైన వైరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కారణంగా ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. అలాంటి వైరస్ మన దేశంలో రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అయితే ఈ సంక్షోభంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిస్తోంది.. అలా మంచి చేసే విషయంలో మహిళలకు కూడా ఆసరాగా నిలుస్తుంది. ఇంకా జన్ ధన్ అకౌంట్ కలిగిన మహిళలకు నెలకు 500 రూపాయిలు ఖచ్చితంగా పడుతుంది. 

 

ఇకపోతే ఈ అకౌంట్ ఉన్నవారికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం మూడు విడతల్లో 1500 రూపాయిలు మహిళల జన్ ధన్ ఖాతాల్లో వేస్తుంది. ఇంకా అలానే జాన్ ధన్ అకౌంట్ ఉన్న పేదలు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఈజీగా తెరవచ్చు. అయితే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరిస్తే నెలకు ఇప్పుడు వచ్చే 500 రూపాయిలే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు పొందొచ్చు. దీని కోసం బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ ననెంబర్ ఖచ్చితంగా లింక్ చేసుకొని ఉండాలి. 

 

ఇంకా జన ధన్ అకౌంట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆరు నెలలు ఓవర్ డ్రాప్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇంకా ఇందు వల్ల 2 లక్షల రూపాయిల వరకు ప్రేమ బీమా కూడా అందచేస్తారు. అంతేకాదు.. 30 వేల రూపాయిల వరకు జీవిత బీమా కవరేజ్ అందచేస్తారు. డిపాజిట్లపై వడ్డీ కూడా అందిస్తారు. ఉచిత మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 

 

ఇంకా ఈ జన్ ధన్ అకౌంట్ తో డబ్బులు కూడా విత్ డ్రా చేసే అవకాశం ఉంది. అయితే ఈ జన్ ధన్ అకౌంట్ తో మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అకౌంట్ బదిలీ చేసుకోవచ్చు. చూశారుగా.. ఈ జన్ దన్ అకౌంట్ తో ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఉచితంగా జన్ ధన్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: