ఎయిర్టెల్, జియో మరియు వీఐ(వొడ‌ఫోన్‌-ఐడియా), బీఎస్ఎన్ఎల్‌ టెలికాం సంస్థ‌లు  28 రోజులు, 56 రోజులు, 84 రోజుల‌తోపాటు 365 రోజుల వాలిడిటీతో కొత్త ప్లాన్ల‌ను అందిస్తున్నాయి. జియో రూ 555 ప్రీపెయిడ్ ప్లాన్  జియో రూపొందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో 84 రోజుల పాటు మొత్తం 126 జిబి డేటా ల‌భిస్తుంది. రోజుకు 1.5 జిబి డేటాను వాడుకునే ప‌రిమితి ఉంటుంది. ఈ ప్లాన్ జియో టు జియో నెట్‌వర్క్‌కు అపరిమిత టాక్‌టైమ్‌ను కూడా ఇస్తుంది. ఆఫ్-నెట్ లేదా జియో నుండి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్ కోసం 3000 నిమిషాల FUP పరిమితితో అపరిమిత టాక్‌టైమ్‌ను ఇస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవ‌చ్చు. మ‌రోవైపు  జియో యాప్‌ల‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  


జియో రూ 599 ప్రీపెయిడ్  ప్లాన్ ప్ర‌కారం.. 84రోజుల పాటు మొత్తం 168 జిబి డేటా ల‌భిస్తుంది. రోజుకు 2 జిబి డేటాను వాడుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో కూడా జియో టు జియో నెట్‌వర్క్‌కు అపరిమిత టాక్‌టైమ్ ఉంటుంది. ఆఫ్-నెట్ లేదా జియో నుండి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్ కోసం, ఈ ప్లాన్ 3000 నిమిషాల FUP పరిమితితో అపరిమిత టాక్‌టైమ్‌ను ఇస్తుంది. ఈ ప్లాన్ లో కూఆ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు వ‌స్తాయి. జియో యాప్‌ల‌ను కూడా ఉచితంగా యాక్సెస్ చేయ‌వ‌చ్చు.  ఎయిర్‌టెల్ రూ 379 ప్రీపెయిడ్ ప్లాన్ : ఇది 6 జిబి డేటాను 84 రోజుల వాలిడిటీ మరియు 900 ఎస్‌ఎంఎస్‌లతో ఇస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.


ఎయిర్టెల్ రూ 598 ప్రీపెయిడ్ ప్లాన్:  ఈ ప్లాన్  84రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5 జిబి డేటాను వాడుకోవ‌చ్చు. అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ ఇస్తుంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తాయి. ఎయిర్టెల్ రూ .698 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజుకు 2 జిబి డేటా, అపరిమిత కాల్స్, రోజుకు  100 ఎస్ఎంఎస్ ఇస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌ అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: