చేతిలో డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకులో వేసుకోవడం మంచిదని అంటున్నారు.. వడ్డీకి ఇవ్వడం డబ్బులు వస్తాయి కానీ, ఉన్నది వచ్చేవరకు నమ్మకం అయితే లేదు.. అలాంటిది ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తే సేఫ్ గా ఉంటుందని చాలా మంది అంటున్నారు.. కొన్ని బ్యాంకులలో డిపాజిట్ చేయడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు అని అంటున్నారు.. మరి అలాంటి బ్యాంకులు ఎంటో ఇప్పుడు చూద్దాం.. 



భారత దేశంలో అతి పెద్ద బ్యాంక్ అంటే ఎస్బీ ఐ, అలాగే ప్రముఖ వాణిజ్య బ్యాంక్ అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లలో మనీ డిపాజిట్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును అని అంటున్నారు. ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం, 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీని పొందొచ్చు. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.9 శాతం, 2-3 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.1 శాతం, 3-5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ లభిస్తుంది. 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీ వస్తుందట..



ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేట్లను చూస్తే.. 7 నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ వస్తుంది. 30-90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ పొందొచ్చు. 91 రోజుల నుంచి 6 నెలల ఎఫ్‌డీలపై 3.5 శాతం, 6 నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తుంది.ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ పొందొచ్చు. 2-3 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.15 శాతం, 3-5 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 5.3 శాతం, 5-10 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.5 శాతం వరకు అదనపు వడ్డీని పొందవచ్చు అని అంటున్నారు.. 



ఇక మిగిలిన బ్యాంకులలో కూడా కొంతవరకు ఇలానే వడ్డీ రేట్లను పొందవచ్చునని అంటున్నారు. ఈ రెండు బ్యాంకులలో డబ్బును డిపాజిట్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: