ప్రముఖ వాహన సంస్థ యమహా తన 2021 ఎఫ్ జెడ్, ఎఫ్ జెడ్ఎస్ మోటార్ సైకిళ్లను భారత మార్కెట్లోకి విడుద‌ల చేసింది.  వీటి ప్రారంభ ధరలు 1.03 లక్షలు, 1.07 లక్షలుగా ఉన్నాయి.  సరికొత్త ఫీచర్లు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఎఫ్‌జెడ్ డ్రైవింగ్ కుర్ర‌కారు మేఘాల‌లో తేలిపోయేట‌ట్లుంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

భారత మార్కెట్లో అత్యుత్తమ నాణ్య‌త క‌లిగిన ద్విచ‌క్ర‌వాహ‌నాలు య‌మ‌హా విడుద‌ల చేస్తూ మంచిపేరు తెచ్చ‌కుంటోంది.  సంస్థకు చెందిన ఎఫ్ జెడ్ సిరీస్ ఇప్ప‌టికే విజయమవంతమైంది. తాజాగా ఈ కంపెనీ ఎఫ్ జెడ్ సిరీస్ లోని 2021 మోడళ్ల ను భారత మార్కెట్లో విడుద‌ల  చేసింది.ఎక్స్ షోరూంలో యమహా ఎఫ్ జెడ్-ఎఫ్ఐ మోడల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.03 లక్షలుగా నిర్దేశించింది. యమహా ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ ధర వచ్చేసి రూ.1.07 లక్షలుగా ప్రకటించింది.

చూడ‌గానే ఆక‌ట్టుకునే రూపంతోపాటు ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగుల్లో ఈ వాహ‌నాల‌ను య‌మ‌హా రూపొందించింది. రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతున్నాయి.  ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ మోడలైతే మ్యాటీ రెడ్ కలర్లో సొంతం చేసుకోవచ్చు. 2021 ఎఫ్ జెడ్ఎస్-ఎఫ్ఐ 3డీ ఎంబ్లంతో లభ్యమవుతుంది.ఈ రెండు మోటార్ సైకిళ్లు సైడ్ అటెండ్ ఇంజిన్ కట్ స్విచ్ ఆఫ్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ తో లభ్యమవుతుంది. అంతేకాకుండా బరువు కూడా రెండు కేజీలు తగ్గాయి. ఎఫ్ జెడ్ఎస్ మోడల్లో బ్లూటూత్ ఎనేబూల్డ్ యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఎస్ టెక్నాలజీని పొందుపరిచారు. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. 149సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్,  7250 ఆర్పీఎం వద్ద 12.4 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 13.6 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. భారత మార్కెట్లో యమహా ఎఫ్ జెడ్, ఎఫ్ జెడ్ఎస్ మోటార్ సైకిళ్లకు పోటీగా సుజుకీ జిక్సెర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, కేటీఎం 125 డ్యూక్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160ఆర్ లాంటి వాహ‌నాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: