శానిటరీ కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఓ గోడౌన్, ట్రక్.. ఇవి ఉంటే సరిపోతుంది.ఈ బిజినెస్ ను ప్రారంభించే ముందు ఎక్కడైతే ఆర్డర్లు ఎక్కువగా ఉంటే అక్కడ ముందే ఈ విషయం గురించి మాట్లాడాలి.వారికి కావాల్సిన బ్రాండ్లను తెలుసుకుని. అవసరమైన వస్తువులు తెచ్చుకోవాలి. హాస్పిటల్ క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటే మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. హాస్పిటల్లు ఎల్లప్పుడూ డిసిన్ఫెక్టడ్ ఇతర శానిటైజేషన్ సామాగ్రి నిత్యం అవసరం ఉంటుంది. సాధారణంగా వారు హోల్ సేల్‌లో కొనుగోలు చేస్తుంటారు.
అయితే, మీరు డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేరుగా ఆసుపత్రికే వారికి కావాల్సిన కెమికల్స్ తెచ్చి ఇస్తే మీకు వారి కాంట్రాక్టు చేసుకుని సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది.కొన్ని కెమికల్స్ కచ్చితంగా వాడాలనే నిబంధనలు ఆసుపత్రులకు ఉంటాయి. వాటి ప్రొడక్షన్ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్ లో భద్ర పరిచి, ఎమ్మార్పీ రేటుకు అమ్ముకున్నా మీకు చాలా లాభం వస్తుంది. ఎమ్మార్పీ ధరకు 10 శాతం డిస్కౌంట్ మాట్లాడుకున్నా కూడా చేతి నిండా లాభాలు వస్తాయి. ఈ ప్రొడక్ట్ లను అమ్మడానికి సేల్స్ బాయ్స్ ను పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి