తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని రిస్క్ లతో వెనకడుగు వేస్తారు. అలాంటి వాళ్లకు ఒక ఆఫ్షన్ ఉంది. ఇదే హోమ్ మేడ్ చాకొలెట్స్. మన ఇళ్ల దగ్గర షాపుల్లో మీరు గమనిస్తే... బ్రాండెడ్ కంపెనీల చాక్లెట్ల కంటే... ఇతర చాక్లెట్లే ఎక్కువగా కనిపిస్తాయి. పిల్లలకు కూడా కాస్ట్‌లీ చాక్లెట్ల కంటే... ఈ చప్పరించే చాక్లెట్లే బాగా నచ్చుతాయి. వాటి రుచి బ్రాండ్ తో సంబంధం లేకుండా ఉంటుంది.


చాక్లెట్ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇండియాలో చాక్లెట్ల వ్యాపారం ఏటా 10 నుంచి 13 శాతం దాకా పెరుగుతూనే ఉంది. ఈమధ్య కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి కాస్ట్‌లీ చాక్లెట్లు ఇండియాలోకి వస్తున్నాయి. సంపన్న వర్గాల వారు వాటిని కొనుక్కుంటున్నారు. ముఖ్యంగా కోకో తో తయారయ్యే చాక్లెట్లకు సంపన్న వర్గాల నుంచి డిమాండ్ బాగా కనిపిస్తోంది. అందువల్ల చాక్లెట్ల వ్యాపారం చేయాలనుకోవడం సరైన నిర్ణయమే అవుతుంది. సాదా సీదా చాక్లెట్లు తయారు చేయాలంటే చేయవచ్చు. ఎటువంటి చాకోలెట్స్ అయినా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..


రూ.40వేల నుంచి రూ.50వేల మధ్యలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే... సాదాసీదా చాక్లెట్లు తయారుచేయవచ్చు. ఈ డబ్బు తో రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ కొనాల్సి ఉంటుంది. అదే భారీ ఎత్తున వ్యాపారం చెయ్యాలి అనుకుంటే... భారీ సంఖ్యలో యంత్రాలు కొనాల్సి ఉంటుంది. ఇందుకు పెట్టుబడి రూ.3 లక్షల దాకా అవుతుంది. ఇందులో ప్రధానంగా... పాలు, పంచదార, ఫ్రూట్స్ వంటివి మిక్సింగ్ చేసే యంత్రం, వాటిని వండే యంత్రం, ఆ పదార్థాన్ని చల్లబరిచే యంత్రం ముఖ్యమైనవి.. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కాలేజీలు, స్కూల్స్ లేదా ఇతర షాప్ లను సంప్రదిస్తే ఇంకా మంచి బిజినెస్ మరింత పెరుగుతుంది. ఇది కనుక క్లిక్ అయ్యితే.. లక్షల్లో లాభం ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: