తరచూ స్టాక్ మార్కెట్ గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. ఇందులో ప్రధానమైనవి షేర్లు. ఇవి మార్కెట్ పరిస్థితిని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ షేర్ మార్కెట్ ద్వారా లాభాలు పొందవచ్చని తెలుస్తోంది. కరోనా కాలంలో సరైన పనుల్లేక, ఉద్యోగాలున్నా పూర్తి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారా ? అయితే తక్షణమే లాభాలు స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెడితే సరి. ప్రస్తుతం ఇక్కడ షేర్ల రేటు భారీగా పెరిగింది. లక్ష రూపాయలు ఉన్న ఒక షేర్ ధరను ఏకంగా మూడులక్షలు పెంచేశారు. మరి ఈ రేంజ్ లో అదృష్టం కలిసొస్తుంది అంటే కాదని కూర్చుంటామా. అయితే ఇక్కడ నష్టపొయే అవకాశాలు కూడ లేకపోలేదు. తెలివిగా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

అందుకు అదృష్టం కూడా అంతో ఇంతో కలిసొస్తేనే లాభాల వెలుగు చూడగలము.  ఇక గత రెండేళ్ల నుండి దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ట్రావెల్స్ పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన వారి సంగతి ఏమో కానీ, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కంపెనీ షేరు మాత్రం షేర్ ఇన్వెస్టర్స్ కి భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే ఈ సంస్థ  గ్లోబల్ వీసా ఔట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ప్రభుత్వాలతో, ఎంబసీలతో ఇంటరాక్ట్ అయ్యి దాదాపు 32 దేశాల్లో కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ ఉంది.

స్మాల్ క్యాప్ స్టాక్ గా ఉన్న ఇందులో ఒక షేర్ 45 రూపాయలు ఉండగా, ఇప్పుడది 135 రూపాయలకు వద్ద ట్రేడ్ అవుతుండటం విశేషం. ఇక్కడ ఎవరైతే లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసి  ఉంటారో ఇప్పుడు వారికి అది కాస్తా మూడు లక్షలకు పైగా చేరుకుని ఉంటుంది.  దాంతో విషయం తెలుసుకున్న ఇన్వెస్టర్లు ఎగిరి గంతు లేస్తున్నారు. అయితే అని సమయాలు ఒకేలా ఉండవు. చూసి జాగ్రత్తగా మార్కెట్ పరిస్థితులను చూసుకుంటూ అడుగేస్తే లాభాల బాట పడతారు. మరింకెందుకు ఆలస్యం సరైన స్టాక్ ను ఎంపిక చేయూస్కుని షేర్ మార్కెట్ రంగంలోకి అడుగు పెట్టండి. లాభాల బాట పట్టండి. ఆల్ ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: