ఈ భూమ్మీద ఉండే ఏ వస్తువైనా ఏదైనా ఒక సమయంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. దేన్ని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. చివరికి మన ప్రతి రోజు ఊడ్చి బయటపడేసే చెత్త కూడా ఏదో ఒక రకంగా ఉపయోగ పడుతుంది. ఆ చెత్త తో ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అలాంటి చెత్తతో ఈమె చాలా మందికి ఉపాధి మార్గం చూపించింది. ఆమె ఎవరో..? ఆమె చేసిన పని ఏమిటో తెలుసుకుందాం.?

 లండన్ నగరంలోని అతి పెద్ద నది అయినా థీమ్స్ ఉన్నది. అట్టి నదిలోకి సుదూర ప్రాంతాల నుంచి చెత్త అంతా వచ్చి ఆ నదిలో చేరుతుంది. ఇలా వచ్చిన చెత్తంతా  క్లీన్ చేయడం అనేది సులువైన పని కాదు. దాని వెనుక ఎంతో కష్టంగా ఉన్నది. అయినా ఆమె వెనక్కి పోకుండా అనుకున్నది సాధించింది. 34 సంవత్సరాలు ఉన్న ఫ్లోరా బ్లాతవేట్ నదిలోకి వచ్చిన ప్లాస్టిక్ చెత్తనంతా పోగుచేసి వాటితో వేలాది గ్రీటింగ్ కార్డులను  తయారుచేసింది. ఈ గ్రీటింగ్ కార్డులను  ఆమె అమ్ముతోంది కూడా.. లాక్ డౌన్  సమయంలో ఉపాధి కోల్పోయిన వాళ్లలో ఫ్లోరా కూడా ఉన్నది. అలా ఖాళీగా కూర్చుంటే ఏమి వస్తుందని ఈ బిజినెస్ ను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆమె వాషిడ్ అప్ కార్డుకు ఫౌండర్ అయింది.

 తేమ్స్ నదిలో కనిపించినా కలర్ ఫుల్ గా ఉండే ప్లాస్టిక్ చెత్తను కలెక్ట్ చేసేది. వాటిలో రకరకాల ఆకారాలలో గ్రీటింగ్ కార్డులను తయారుచేసే అమ్ముతోంది. అలా వారంలో దాదాపు నాలుగు వేల నుంచి 5 వేల కార్డులనమ్మి డబ్బులు సంపాదిస్తోంది. ఆమె ఆలోచనలతో నది శుభ్రం అవ్వడమే  కాకుండా ఆమెకు డబ్బులు కూడా వస్తున్నాయి. మొదటిసారి ఈ కార్డులను తయారు చేసినప్పుడు అమ్మాలనే ఆలోచన లేదట.. వాటిని తయారు చేసి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు, తమ స్నేహితులకు బంధువులకు ఇచ్చేదట. వారు వాటిని చూసి చాలా బాగున్నాయని, వీటిని అమ్మితే బాగుంటుందని సలహా ఇచ్చారట. దీంతో ఫ్లోరా వెంటనే బిజినెస్ చేయడం ప్రారంభించింది. ఆమె బిజినెస్ తో పాటు మరొక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: