రేపు అనగా బుధవారం సెప్టెంబర్ 8న శ్రీమంత శంకరదేవ తిథి ఉంటుంది. అలాగే గురువారం అంటే సెప్టెంబర్ 9న లంబాడీల ఆరాధ్య పండుగ తీజ్ పండుగ ఉండనుంది. దీంతో పాటు శుక్రవారం సెప్టెంబర్ 10న హిందువులతో పాటు అన్ని రకాల మతాల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి ఉంది. వీటితో పాటు సెప్టెంబర్ 11న రెండో శనివారం, సెప్టెంబర్ 12న ఆదివారాలు సాధారణ సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ వినియోగదారులు ఈ సెలవులను గమనించాలి. అలాగే పనులను ఈ రోజే ముగించుకోండి.
అయితే అన్ని రాష్ట్రాల ఉన్నబ్యాంక్ లకు ఈ సెలవులు వర్తించవు. బ్యాంక్‌ల సెలవులు అన్ని రాష్ట్రాలకు సమానం ఉండవు. ఆయా రాష్ట్రం పరిస్తితిని బట్టి బ్యాంక్ ల సెలవులు మారతాయి. సెలవు దినాలల్లోనూ అన్ని బ్యాంక్ ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు అన్ని రకాల యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ పండుగలు జరుకునే రాష్ట్రాలల్లో మాత్రమే అన్ని బ్యాంక్ లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఈ పండుగలు జరుపుకోని రాష్ట్రాలల్లో బ్యాంక్ లకు సెలవులు ఉండవు. అక్కడ అన్ని బ్యాంక్ లు యదావిధింగా తెరుచుకుంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి