నల్ల కుబేరుల గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న అక్రమార్జన మళ్లీ బట్టబయలు కాబోతోంది. బ్యాంకులోని భారతీయులకు గల ఖాతాలకు సంబంధించిన మూడవ జాబితా విడుదల అయిపోయింది. భారత్ లో గల సమాచార మార్పిడి ఒప్పందాల ఆధారంగా ఈ వివరాలను అందించింది స్విజర్లాండ్. అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును  స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు కొంతమంది నల్ల కుబేరులు. అయితే ఇలాంటి అక్రమార్జన చేసిన వ్యక్తులకు ఇకనుంచి స్విట్జర్లాండ్ ఏ మాత్రం  సురక్షిత ఈ ప్రాంతం కాదని తమ బ్యాంకు లోనే భారతీయ ఖాతాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేయనుంది స్విట్జర్లాండ్.

 ఇప్పటివరకు 2 జాబితాలో ఇచ్చిన స్విట్జర్లాండ్. తాజాగా మూడో జాబితాను కూడా అందజేస్తుంది. స్విట్జర్లాండ్ లో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతీయ ఖాతాల వివరాలు అందజేస్తోంది. భారత్ సహా 96 దేశాలకు చెందినటువంటి మొత్తం 33 లక్షల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు అందజేసింది స్విట్జర్లాండ్కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అసోసియేషన్ ఎఫ్ డి ఏ తెలిపింది. భరత్ తో పాటుగా ఇంకా అనేక దేశాల పౌరుల చెందినటువంటి ఖాతాల వివరాలను తెలియజేసింది. ఆయా దేశాల  వారి సంస్థలు పేరుతో ఉన్న ఖాతాల వివరాలను అందజేసింది స్విట్జర్లాండ్.

 సమాచార మార్పిడి కోసం జరిగినటువంటి ఒప్పందం ఏ ఈ ఓ ఐ లో భాగంగా 2019లో స్విట్జర్లాండ్ భారతదేశానికి తొలి జాబితా అందింది. 2020 సెప్టెంబర్ లో రెండో జాబితా అందింది. తాజాగా మూడో జాబితా కూడా అందజేసింది. కానీ మూడో సారి  భారతీయుల స్థిరాస్తి వివరాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్లో అపార్ట్మెంట్లు ప్లాట్లు, వివరాలతో పాటుగా ఆయా స్థిరాస్తుల ద్వారా వాళ్లు సంపాదిస్తున్న ఆదాయ వివరాలు కూడా అందజేస్తున్నట్లు సమాచారం. దీంతో నల్ల కుబేరులు వణికిపోతున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు బయటపడుతుందని  భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: