స్పాన్స్ సంస్థ అధినేత సారా బ్లాకెల్లీ వార్షిక లాభాలు ఆశించినంత రావడంతో సంతోషంగా ఉద్యోగులకు పనిచేసింది. దీనితో ఒక్కో ఉద్యోగి దాదాపు 7.5 లక్షల బోనస్ పొందాడు. తాజాగా సంస్థ ల్యాడ్ బైబిల్ ప్రకారం పెట్టుబడి సంస్థ బ్లాక్ స్టోన్ మెజారిటీ వాటాను కొనుగోలుచేసింది. దీనితో లాభాలు భారీగా వచ్చాయి. ఈ లాభాలు సాధించడానికి ఉద్యోగుల కృషి కూడా ఉంది అంటూ వారికే లాభాలను పనిచేసింది. అయితే సంతోషంలో పార్టీ పెట్టి మరి అందులో ఉద్యోగులను ఆశ్చర్యపరిచేట్టుగా బోనస్ విషయాన్ని ప్రకటించింది సారా. ఆమె మాట్లాడుతూ, నేను మీకు బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను, దానిలో భాగంగా అందరికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి సరదాగా కొంతకాలం గడపడానికి పదివేల డాలర్ల విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లను ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నారు.

అయితే ఈ టిక్కెట్ వద్దు అనుకుంటున్న వారికి నగదు రూపంగా కూడా బహుమతి ఇవ్వనున్నట్టు సారా తెలిపింది. అనుకోకుండా సారా ప్రకటించిన బహుమతి గురించి విన్న ఉద్యోగులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు, సంతోషం వ్యక్తం చేశారు. నా సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తన ఆనందాన్ని పంచాలని, వాళ్ళు కూడా ఈ ఆనందాన్ని మనసారా ఆస్వాదించాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఇంతకాలం మనం అందరం పడిన కష్టం ఫలించడం వలననే ఈ లాభాలు వచ్చాయని, అందుకే ఫలితాన్ని సమంగా పంచుతున్నానని సారా అన్నారు. ఈ క్షణం లో ఆనందాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోకూడదని, అంత మధుర జ్ఞాపకంగా ఉండాలని ఈ పని చేసినట్టు సారా తెలిపారు.

మొత్తానికి సారా మాటలతో అక్కడ ఉన్న ఉద్యోగులను ఆనందింపజేయటమే కాకుండా, ఏడ్పించేసింది కూడా. కొందరు ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఏడవటం ద్వారా వ్యక్తం చేస్తే, మరికొందరు డాన్సులు చేస్తూ వ్యక్తం చేశారు.  ఇలా అక్కడ పార్టీ మొత్తం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. సారాపై ఉద్యోగులందరూ ప్రశంసల జల్లు కురిపించారు. తమకు గొప్ప మనసు ఉన్న బాస్ లభించిందని కొనియాడారు. ఈ వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: