దేశంలో ఆ మధ్య బ్యాంకు స్కాం లు సంచలనమే సృష్టించాయని చెప్పాలి. నల్లధనం వెలికితీస్తాను అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పై ఈ ప్రభావం బాగా పడింది. అప్పటి స్కాం ల గురించి ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి తప్ప ఒక్కరూపాయి వెనక్కి తెచుకోగలిగింది లేదు. ఈ ఆర్థిక నేరగాళ్లందరూ ఎంచక్కా దేశం వీడిపోయి బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది, అది బీజేపీ ప్రభుత్వానికి ఘోరమైన అనుభవాన్ని మిగిలించిందని చెప్పాలి. అనంతరం మీడియా దానిపై చల్లబడటం జరగటంతో మళ్ళీ ఆ వార్తలు ఆఖరి పేజీకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరికొన్ని బ్యాంకులను విలీనం దిశగా అప్పుల నుండి రక్షించడానికి ప్రయత్నించింది.

సాధారణంగా ఒక సామాన్యుడు బ్యాంకుకు వెళితే ఆ కాగితం ఈ కాగితం అంటూ తిప్పుకుంటారు. కానీ పెద్దవారు అనగానే కూర్చోబెట్టి కూల్డ్రింక్ ఇచ్చి మరి సేవలు చేస్తారు, అప్పులు సామాన్యుడు కట్టకపోతే జప్తులు చేసేస్తారు, బలిసినోడు స్కాం లు చేసి దొబ్బేస్తే మాత్రం ఏమీ పీకలేకపోతున్నారు. అధికారులు మాత్రం రాజకీయ నేతలు అండ ఉన్నంత కాలం చేతులు ముడుచుకుని కూర్చోక చేసేది ఏముంటుంది. అయితే ఇక్కడ స్కాం లను బ్యాంకు అధికారులు కూడా కారణంగా తేలినప్పటికీ, వాళ్లపై చర్యలు ఏమి తీసుకున్నది కూడా బయటకు రాదు అదేమిటో. అక్క పేదవాడు తీసుకున్న ఋణం తీర్చకపోతే జప్తు పేరుతో పరువు తీసేస్తారు, ఇదేనా సమన్యాయం, సామజిక న్యాయం అంటే. ప్రభుత్వాలు ఇలాంటి స్కాం లను చేసే వారిని వెనకేసుకుంటూ వస్తున్నంత కాలం దేశం మరికాస్త వెనక్కి పోతుంది తప్ప ముందుకు వెళ్లే అవకాశం ఉండనే ఉండదు అని గ్రహించాలి.  

తాజాగా బైట్ బాట్ సంస్థ సంజయ్ పంజాబ్ బ్యాంకు కు కుచ్చు టోపీ పెట్టాడు. ఇది గతంలో స్కాం కంటే ఘోరమైంది అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రకారంగా 15000కోట్ల రూపాయల స్కాం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. దీని వెనుక కూడా బ్యాంకు అధికారుల హస్తం ఉన్నదని తెలుస్తుంది. అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ గత స్కాం లను స్ఫూర్తిగా చేసుకున్నట్టే ఉంది, అందుకే కేవలం 200కోట్ల ను చూపెట్టి 15000కోట్లు కొల్లగొట్టుకొని చెక్కేశాడు. ఇలా స్ఫూర్తి పొందమంటారా.. చర్యలు త్వరితగతిన తీసుకొంటారా అంటూ యువత ప్రశ్నిస్తే సమాధానం ఏమి ఇవ్వనున్నారు ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: