ఇక మీరు మీ డబ్బును కనుక రెట్టింపు చేసుకోవాలంటే పొదుపు పథకం మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో కూడా కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ల రూపంలో పొదుపు పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.ఇక ఇది నిర్ణీత వ్యవధి (ప్రస్తుతం 124 నెలలు) తర్వాత మీ పెట్టుబడిని రెట్టింపు చేయడానికి రూపొందించబడిన స్థిర రేటు చిన్న పొదుపు పథకం. మీరు ఈ పథకంలో కేవలం రూ. 1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ లేదు. ఈ పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం డబ్బు మొత్తం 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇంకా అలాగే కిసాన్ వికాస్ పత్ర (KVP) సౌకర్యాన్ని దేశంలోని 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో ఈజీగా పొందవచ్చు.ఇక ఈ కిసాన్ వికాస్ పత్రలో 6.9% చొప్పున వడ్డీని పొందవచ్చు. పథకంలో జమ చేసిన మీ డబ్బు కేవలం 124 నెలల్లోనే రెట్టింపు అవుతుంది. 124 నెలలు అంటే 10 సంవత్సరాల 4 నెలలు. అంటే ఇక మీ అసలు మొత్తం కూడా రెట్టింపు అవుతుంది.


మీరు కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ. 1000 పెట్టుబడి అనేది పెట్టాలి. ఇది కాకుండా ఇందులో గరిష్ట పెట్టుబడిపై పరిమితి అనేది లేదు. మీరు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ 1000, 5000, 10000, 50000 రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు.ఇక ఇందులో మీరు మెచ్యూరిటీకి ముందు నిర్దిష్ట పరిస్థితుల్లో డబ్బును విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఇక మెచ్యూరిటీ తర్వాత, మీరు మీ డబ్బును ఏదైనా పోస్టాఫీసు నుండి తీసుకోవచ్చు.ఇంకా అలాగే కిసాన్ వికాస్ పత్ర ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మీకు ఎప్పుడైనా కానీ మీకు డబ్బు అవసరమైతే మీరు మీ డబ్బును రెండున్నరేళ్ల తర్వాత కూడా ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. దానిపై మీకు 6.9 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్రలో మీ పెట్టుబడికి మంచి భద్రత అనేది ఉంటుంది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. ఇక మీ డబ్బుని బాగా రెట్టింపు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: