అదానీ గ్రూప్‌లోని ముఖ్యమైన కంపెనీల్లో ఒకటైన అదానీ పవర్ లిమిటెడ్ కంపెనీ మూడు నెలల లాభం రూ.4779.86 కోట్లుగా ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు మూడు నెలల కాలంలో కంపెనీ ఇంత భారీ లాభాలను ఆర్జించింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం లాభం రూ.278.22 కోట్లు. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని పేర్కొంది.జూన్‌ నెలతో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.15,509 కోట్లకు పెరిగింది.అలాగే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.7213.21 కోట్లు. గత ఏడాది జూన్ త్రైమాసికంలో మొత్తం రూ.6763.5 కోట్లుగా ఉన్న వ్యయం గత ఆర్థిక త్రైమాసికంలో రూ.9642.8 కోట్లకు పెరిగింది.ఇక అదానీ పవర్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ పవర్ ఉత్పత్తిదారుగా ఉంది. గుజరాత్‌తో పాటు, ఇంకా కంపెనీ ఏడు ప్రదేశాలలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి 13610 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా అదే సమయంలో ఇటీవలి కాలంలో గౌతమ్ అదానీ వ్యాపారంలో భారీ వృద్ధిని సాధించినట్లు గణాంకాలు అనేవి చెబుతున్నాయి. అదానీ ఆస్తులు మొత్తం 115 బిలియన్ డాలర్లు. ఇంకా అతని ఆదాయం సెకనుకు రూ.1.4 కోట్లు అని సమాచారం తెలుస్తుంది.అలాగే గంటకు రూ. 83.4 కోట్లు సంపాదిస్తున్నాడు.


ఇక గౌతం అదానీ ఆదాయం రోజుకు రూ.1000 కోట్లు.ఈ గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ చైర్మన్. అతను ఛైర్మన్ రెమ్యునరేషన్‌గా సంవత్సరానికి మొత్తం 1.8 లక్షల కోట్లు పొందుతున్నాడు. అదానీ నెలవారీ ఆదాయం  వచ్చేసి రూ.15,000 కోట్లు.అందుకే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో బిల్ గేట్స్‌ను అధిగమించి అదానీ నాలుగో స్థానంలో నిలిచారు.ఇక ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో అదానీ బిల్ గేట్స్‌ను ఓడించారు.బిల్ గేట్స్ నికర విలువ వచ్చేసి 104.6 బిలియన్ డాలర్లు. అలాగే 90 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. 2026 వ సంవత్సరం నాటికి బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వార్షిక విరాళాన్ని 50 శాతం పెంచే ప్రయత్నంలో భాగంగా బిల్ గేట్స్ ఈ నెలలో మొత్తం 20 బిలియన్లను విరాళంగా ఇవ్వబోతున్నారు. అందువల్ల సంపన్నుల జాబితా నుంచి బిల్ గేట్స్ దిగజారుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: