ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ గుర్తింపు పొందిన పెద్ద పెద్ద టెక్‌  కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. గూగుల్‌, మెటా లాంటి పెద్ద పెద్ద మల్టీ నేషనల్‌ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి.ఇక గత కొన్ని రోజులుగా లేఆఫ్స్‌కి సంబంధించిన వార్తలు పెద్దగా రావడం లేదని సంతోషించేలోపే ఇండియన్‌ టాప్ టెక్‌ కంపెనీల్లో ఒకటైన విప్రో పెద్ద బాంబు పేల్చింది. విప్రో కంపెనీ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో తన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇందులో భాగంగానే మొత్తం 120 మంది టెక్కీలను తొలగించాలని విప్రో నిర్ణయించింది. అయితే ఈ తొలగింపులు అనేవి కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం. అది కూడా అమెరికాలోని టంపాలో మాత్రమే ఈ ఉద్యోగ కోతలు ఉన్నాయి.


లేఆఫ్‌కి గురైన ఉద్యోగుల్లో మొత్తం 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక మిగిలిన వారు టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్ స్థాయి ఉద్యోగులని సమాచారం తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని సమాచారం తెలుస్తోంది. ఇక మే నెలలో అయితే కంపెనీ ఉద్యోగుల శాశ్వత తొలగింపులను ప్రారంభించనుంది.ఇక ఇదిలా ఉంటే విప్రోకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం 20,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే విప్రో ఆదాయంలో దాదాపు 60 శాతం ఆదాయం అనేది అమెరికా నుంచే వస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా దేశంలోనే ఉద్యోగుల తొలగింపు మొదలు పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే విప్రో కంపెనీ ఇంటర్నల్ ఎసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన దాదాపు 400 మంది ఫెషర్లను తొలగించిన విషయం కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: