2017 వ సంవత్సరంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నుండి బ్యాంకింగ్ లైసెన్స్‌ని పొందింది.ఆ తరువాత బ్యాంక్ తన పనులు ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే లైసెన్సింగ్ షరతులను ఉల్లంఘించినందుకు.. కేవైసీ నిబంధనలను పాటించనందుకు రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌ను కూడా ఎదుర్కొంది. 2018లో కొత్త అకౌంట్స్ ఓపెనింగ్ ఆగిపోయింది. 2021లో రెండో క్రాక్ డౌన్ వచ్చింది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ తప్పుడు సమాచారాన్ని సమర్పించిందని ఆర్బీఐ కోటి రూపాయిల జరిమానాని విధించింది.తరువాత ఆరు నెలలకే.. పేటీఎం ఇంకా One97 కమ్యూనికేషన్‌ల సర్వర్‌లు రెండు వేర్వేరు సర్వర్ లుగా పనిచేయకపోవడంతో పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ పర్యవేక్షణ పరిమితిని విధించింది. ఇది వెంటనే అమల్లోకి రావడంతో దాని ప్రభావం కూడా ఫాస్ట్ గా పడింది. ఇక ఫిన్‌టెక్ కొత్త కస్టమర్‌లను బోర్డింగ్ ను ఆపివేయాల్సి వచ్చింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించడానికి ఎక్స్ టర్నల్ ఆడిట్ సంస్థను కూడా నియమించింది.మళ్లీ గత ఏడాది అంటే అక్టోబర్ 2023లో, కేవైసీ నిబంధనలను కొనసాగించకపోవడంతో ఆర్బీఐ 5.39 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది.


గత వారం ఆర్‌బిఐ విధించిన ఆంక్షలతో పేటీఎం పనులపై పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది. మీడియా నివేదికల ప్రకారం ఇది మాత్రమే కాదు.. కేవైసీ, డిజిటల్ మోసాలు ఇంకా మనీ లాండరింగ్ వంటివి ఉన్నాయి. కేవైసీ గురించి చెప్పాలంటే పెద్ద సంఖ్యలో కస్టమర్‌లు వారి కేవైసీ ఆమోదంని పొందలేదు. వారి పాన్‌కార్డును ధృవీకరించలేదు.ఇక ఇవే కాకుండా.. రిజర్వ్‌ బ్యాంక్‌ దర్యాప్తులో మరికొన్ని విషయాలు కూడా వెలుగుచూశాయి. ఒకే పాన్ నెంబర్ ను వంద కంటే ఎక్కువ ఖాతాలకు.. మరికొన్ని కేసుల్లో ఒకే పాన్ నెంబర్ ను వేలాది కస్టమర్ అకౌంట్లకు లింకయి ఉంది. ఆ ఖాతాలలోని లావాదేవీల విలువ కొన్ని కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది.అయితే ఇది కనీస కేవైసీకి నిబంధనలను కూడా పాటించలేదు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.అలాగే మ్యూల్ అకౌంట్స్ ను పెద్ద మొత్తంలో డోర్ మంట్ ఖాతాల నుంచి ఉపయోగించారు.అంటే అవి నగదు బదిలీకి మాత్రమే వాడే ఖాతాలు. ఇక ఆ అకౌంట్స్ లో డబ్బులు ఉండవు. అవి డిపాజిట్ చేసిన వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తారు. పేటీఎం నిర్వహిస్తున్న 35 కోట్ల ఖాతాల్లో 31 కోట్ల ఖాతాలు యాక్టివ్ గా లేవట.

మరింత సమాచారం తెలుసుకోండి: