సాధారణంగా ఒక కారు కొనుక్కుని.. సొంతిల్లు కట్టుకోవాలని ప్రతి సామాన్యుడు కూడా ఆశ పడుతూ ఉంటాడు. దీంతో ఇలా ఇలా కన్న కలలను నిజం చేసుకునేందుకు ఇక ఎంతో కష్టపడి పోతూ ఉంటాడు. రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ  కొంత మంది కలను నెరవేర్చుకుంటే ఇంకొంత మంది మాత్రం ఇక ఎంత కష్టపడినా.. కారు కొనుగోలు చేసేందుకు డబ్బులు సరిపోక సర్దుకుపోతూనే ఉంటారు. ఇక ఇటీవల కాలంలో కార్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో సామాన్యులకు కార్ కొనుగోలు చేయడం.. ఇక ఏసీ కార్లలో తిరగడం అనేది కేవలం కలగానే మారిపోయింది. ఇకనుంచి అలా కాదు కార్లు కొనుగోలు చేయాలంటే లక్షలు కావాలి.. అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే లక్షల రూపాయలు చెల్లించకుండానే ఇక కారులో తిరుగేయొచ్చు. అది కూడా కారు కొనుగోలు చేయకుండానే కొత్త ఏసీ కార్లను వాడుకోవచ్చు. అదేంటి కారు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఊరికే ఇలా వాడుకోవడానికి ఇస్తాయా అని అనుమానం కలుగుతుంది కదా. అవును ఇలాగే ఓ కంపెనీ ఆఫర్ ప్రకటించింది.


 ప్రస్తుతం ఇండియాలో బాగా ట్రెండింగ్ లో ఉంది కీయ కార్ల కంపెనీ. ఇక ఈ కంపెనీ ఇటీవలే బంపర్ ఆఫర్ ప్రకటించింది. లక్షల రూపాయలు వెచ్చించి కొత్త కారును కొనే బదులు.. ఇష్టం వచ్చినంత కాలం ఇక కారును అద్దెకు తీసుకుని నడుపుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్ సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో కియా లీజ్ సేవను ప్రవేశపెడుతుంది. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధికి కొత్త కార్లను అద్దెకు తీసుకోవచ్చు. ఇక ఈ అద్దె చార్జీలు నెలకు 22 వేల నుంచి మొదలవుతాయి. అయితే కారు మోడల్ ని బట్టి ఇక అద్దె కూడా కూడా మారుతూ ఉంటుంది అన్న విషయాన్ని కియా కంపెనీ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kia