భారతదేశం అంటేనే సర్వ మతాలు సర్వ కులాలు ఉండే దేశం. చాలామంది ప్రజలు కులమతాల మధ్య కొట్టుకు చస్తారు తప్ప  ప్రభుత్వాలను ప్రశ్నించడం తక్కువ.. నిజానికి భారతదేశంలో ఒక 20 మంది దగ్గర ఉండే సంపద మొత్తం భారతదేశ ప్రజల దగ్గర ఉండే సంపదతో సమానంగా ఉంది. ఈ విధంగా ఆ కొంతమంది దేశాన్ని పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకుంటారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంబానీ ఫ్యామిలీ.. ఈ కుటుంబం వారు ఇండియాలో చేయని బిజినెస్ లేదు. అన్ని రంగాల్లో వీరిదే పై చేయి ఉంటుంది. అంతేకాదు రాజకీయాలను కూడా  శాసిస్తూ ఉంటారు.. అలాంటి ఈ బడా కుటుంబానికి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో పలు స్కూల్స్,కాలేజెస్ కూడా ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీకి చెందినటువంటి ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబైలో ఉంది. 

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేస్తారో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం.. కిండర్ గార్డెన్ నుంచి ఏడవ తరగతి వరకు 1.70 లక్ష రూపాయలు, ఎనిమిదో తరగతి నుంచి పదవ తరగతి(ICSE) 1.85 లక్షల రూపాయలు, అలాగే 8 నుంచి 10 వరకు  (IGCSE) 5.9 లక్షల రూపాయలు, 11 నుంచి 12వ తరగతి (IBDP)9.65 లక్షల రూపాయలు ఫీజు ఉంటుందట. ఈ ఫీజులను సామాన్య ప్రజలు చూసి ఎంతో షాక్ అవుతున్నారు. విద్యలో కూడా వీళ్ళు ఇంత దోపిడీ చేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ స్కూల్స్ లో ఎక్కువగా కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్, షారుఖ్ ఖాన్ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు, రాజకీయ నాయకుల వ్యాపారస్తుల పిల్లలే చదువుతారట. ఏది ఏమైనాప్పటికీ దేశంలో ఉచితంగా అందించాల్సినవి కార్పొరేట్ పరం చేశారు  కార్పొరేట్ పరం చేయాల్సినవి ఉచితంగా అందిస్తున్నారు. మన దేశ భవిష్యత్ మారాలంటే విద్య వైద్యం అనేది తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి అందరికీ సమానంగా ఉంటేనే అభివృద్ధి బాటలో పడుతుందని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: